కడప జిల్లా రాజంపేట అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలలో రాజావారు రాణిగారు చిత్ర బృందం సందడి చేసింది. చిత్రంలోని మొదటి పాటను విద్యార్థుల ఆనందోత్సాహాల మధ్య విడుదల చేశారు. ఈ పాటకు యువత చిందులేసి, కేరింతలు కొడుతూ సందడి చేశారు. జీవితంలో ఏదో సాధించాలని ప్రతి ఒక్కరు కలలు కంటుంటారు, అయితే దానికి కష్టంతో పాటు క్రమశిక్షణ ఉండాలని సినిమా చిత్ర కథానాయకుడు అబ్బవరం కిరణ్ అన్నారు. తాను ఇదే కళాశాలలో చదివానని, క్రమశిక్షణ వల్లే ఈ స్థాయిలో ఉన్నానని ఆయన తెలిపారు.
క్రమశిక్షణతోనే విజయం..రాజావారు రాణిగారు చిత్రం ఫేం హీరో అబ్బవరం - rajavari ranigaru
లక్ష్య సాధన లో కష్టంతో పాటు క్రమశిక్షణ ఉంటేనే విజయం వస్తుందని రాజావారు రాణిగారు చిత్ర కథానాయకుడు అబ్బవరం కిరణ్ అన్నారు. కడప జిల్లాలో తను చదువుకున్న కాలేజిలో చిత్రంలోని మొదటి పాటను విడుదల చేశారు ఆయన.
అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలలో రాజావారు రాణిగారు చిత్ర బృందం సందడి