ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆదినిమ్మాయపల్లి ఆనకట్టకు జలసిరి

కృష్ణాజలాలు రాకతో కడప జిల్లా ప్రజల ఆనందాలకు అవధుల్లేవు. ఆదినిమ్మాయపల్లి ఆనకట్టకు 9 అడుగుల మేర నీరు చేరటంతో దిగువన ఉన్న కేసీ కెనాల్​కు డిప్యూటీ సీఎం అంజాద్​ భాష, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాధ్​ రెడ్డి నీళ్లు వదిలారు.

ఆధినిమ్మాయపల్లి ఆనకట్టకు జలసిరి

By

Published : Aug 11, 2019, 5:07 PM IST

ఆదినిమ్మాయపల్లి ఆనకట్టకు జలసిరి

కృష్ణమ్మ రాకతో కడప జిల్లాలోని ఆదినిమ్మాయపల్లి ఆనకట్టకు జలకళ వచ్చింది. వల్లూరు మండలం ఆదినిమ్మాయపల్లి ఆనకట్టకు పూర్తి నీటి సామర్థ్యం 19 అడుగులు కాగా.. 9 అడుగుల మేర నీరు చేరింది. ఆదినిమ్మాయపల్లి ఆనకట్ట నుంచి కేసీ కెనాల్​ దిగువకు డిప్యూటీ సీఎం అంజాద్ భాష, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాధ్​ రెడ్డి నీళ్లు వదిలారు. మన రాష్ట్రంలో వర్షాలు కురవకపోయినా.. పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలో వర్షాలు కురవడం వల్ల చుక్క నీరు ఉండని ప్రాంతంలో నీరు పుష్కలంగా లభిస్తుందని రవీంద్రనాథ రెడ్డి తెలిపారు. ఇది ఆయకట్టు రైతులకు శుభసూచకమని పేర్కొన్నారు. భవిష్యత్తులో నీటి కొరత లేకుండా ఉండాలంటే గోదావరి-కృష్ణా నదుల అనుసంధానం తప్పనిసరంటూ పేర్కొన్నారు. ఆదినిమ్మాయపల్లి ఆనకట్టకు నీరు రావటంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details