కరోనా బాధితులకు వైద్యం అందించేందుకు కడప జిల్లాలోని అన్ని ప్రైవేటు ఆసుపత్రులు ముందుకు రావాలని ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా అన్నారు. కడప రాష్ట్ర అతిథి గృహంలో ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులతో సమావేశం నిర్వహించారు.
జిల్లాలో ఆరోగ్యశ్రీ అనుమతి ఉన్న అన్ని ఆసుపత్రులు కొవిడ్ బాధితులకు వైద్యం అందించాలని ఉపముఖ్యమంత్రి సూచించారు. ఇందుకు జిల్లా యంత్రాంగం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. కలెక్టర్‌తో సంప్రదించి పారా మెడికల్ సిబ్బందిని నియమించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కరోనాకు వైద్యం అందించే ప్రైవేటు ఆసుపత్రుల్లోని పారా మెడికల్ సిబ్బందికి.. ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలలో మొదటి ప్రాధాన్యం ఇస్తామని స్పష్టంచేశారు. దేశంలో ఎక్కడా చేయని విధంగా రాష్ట్రంలో కరోనా పరీక్షలు చేస్తున్నామన్నారు.