దేశంలోనే అత్యధికంగా కరోనా పరీక్షలు చేస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ముందుందని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా అన్నారు. కడప జిల్లా మోచంపేట్లో ఏర్పాటు చేసిన సంజీవని బస్సును ఆయన ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజు 50 వేలకుపైగా కొవిడ్ పరీక్షలు చేస్తున్నామని...ఒక్క కడప జిల్లాలోనే ఐదు వేలకుపైగా పరీక్షలు నిర్వహిస్తున్నామని వివరించారు. వైరస్ వ్యాప్తి నియంత్రణకు వైకాపా ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. బాధితుల ఆరోగ్యం కోసం అన్ని రకాల చర్యలను చేపడుతున్నామని తెలిపారు.
ప్రతిరోజు 50వేలకుపైగా పరీక్షలు చేస్తున్నాం: అంజాద్ బాషా - కరోనా వైరస్ వార్తలు
కొవిడ్ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ ముందుందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా అన్నారు. వైరస్ వ్యాప్తి నియంత్రణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్న ఆయన...ప్రతి రోజు 50వేలకు పైగా పరీక్షలు చేస్తున్నామని చెప్పారు.
Deputy Chief Minister Amzath Basha