కర్నూలు, కడప జిల్లాల మీదుగా ప్రవహించే నదుల్లో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. నాలుగు రోజులపాటు కురిసిన భారీ వర్షాలతో ఉరకలెత్తిన కుందూనది ఇప్పుడిప్పుడే శాంతిస్తోంది. నిన్న సాయంత్రం 3 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం ఉండగా.. ఈరోజు ఉదయానికి 32 వేల 767 క్యూసెక్కులకు పడిపోయినట్లు కేసీ కాల్వ అధికారులు గుర్తించారు.
శాంతించిన కుందూ.. తగ్గుముఖం పట్టిన వరద
కర్నూలు, కడప జిల్లాలో వర్షాలు తగ్గాయి. మూడు రోజులుగా ఉప్పొంగిన కుందూ నదిలో ప్రవాహం క్రమేపీ తగ్గుతోంది.
తగ్గుముఖం పట్టిన కుందూనది నీటి ప్రవాహం