Cyber Crime: రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో సైబర్ మోసాలకు పాల్పడుతున్న మహ్మద్ రియాజ్ అనే వ్యక్తిని కడప జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ ఏటీఎం కార్డులు సృష్టించి... ఏటీఎం కేంద్రాల వద్ద వృద్దులు, మహిళలను నమ్మించి వారి పిన్ నంబర్లను తస్కరించి డబ్బులు కాజేస్తున్నట్లు పోలీసు విచారణలో తేలింది.
Cyber Crime : వృద్దులు, మహిళలే లక్ష్యం..ఏటీఎం వద్ద నమ్మించి... - సైబర్ మోసాలు
Cyber Crime: ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో సైబర్ మోసాలకు పాల్పడుతున్న మహ్మద్ రియాజ్ అనే వ్యక్తిని కడపజిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.
నిందితుడు రియాజ్‌పై ఆరు జిల్లాల్లో 56 సైబర్ క్రైం కేసులు నమోదు అయ్యాయని కడపజిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. 13 లక్షల రూపాయల వరకు ప్రజల డబ్బును కాజేసిన నిందితుని నుంచి.. పలు నకిలీ ఏటీఎం కార్డులు, 3 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ప్రజలు ఎవ్వరూ కూడా ఏటీఎం కేంద్రాల్లో అపరిచిత వ్యక్తులకు పిన్ నంబర్లు కానీ, ఏటీఎం కార్డులు గానీ ఇవ్వకుండా జాగ్రత్త వహించాలని ఎస్పీ వెల్లడించారు.
ఇదీ చదవండి:Red sandal smugglers in Kadapa: చక్రం తిప్పుతున్న బడా స్మగ్లర్లు.. విదేశాలకు తరలిపోతున్న ఎర్ర బంగారం