కడప జిల్లా ఒంటిమిట్ట మండలంలోని సీతాపురం గ్రామానికి చెందిన మహిళఆ రైతు నాగిశెట్టి చిలకమ్మ ఐదెకరాల్లో తినే దోస (ఖర్బూజ) వేశారు. దుక్కులు, ఎరువులు, విత్తనం, బిందుసేద్యం మల్చింగ్ కోసం రూ.నాలుగు లక్షలు వెచ్చించారు. నాలుగేళ్ల తరువాత సకాలంలో వర్షం కురవడంతో ఇంటిల్లిపాది శ్రమించి బీడుగా ఉన్న మెట్ట నేలను చదునుగా చేసి సాగు చేశారు. అనుకున్నట్లే కాపు బాగా వచ్చింది. చేతికందాల్సిన పంట ఇటీవలి వర్షాలతో నీటి పాలైంది. సాళ్ల బొదెలు నిండా కాయలున్నాయి. పచ్చగా ఉండాల్సిన తీగలు కుళ్లిపోయాయి. కాయలు కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. చేలోనే వదిలేశారు. పెట్టుబడిలో పైసా రాలేదని కంట తడిపెట్టారు.
పొలంలో వరద నీరు... రైతు కంట కన్నీరు
నివర్ తుపాను కారణంగా కడపజిల్లాలో భారీగా పంటలు దెబ్బతిన్నాయి. ఒంటిమిట్ట మండలంలోని పంటపొలాల్లో వరద నీరు అలాగే ఉంది. మండలంలోని సీతాపురంలో సాగుచేసిన దోస (ఖర్బూజ) పంట పూర్తిగా దెబ్బతింది.
కడప జిల్లాలో దెబ్బతిన్న పంట