ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జమ్మలమడుగులో జోరుగా ఐపీఎల్ బెట్టింగ్...7 గురు బుకీలు అరెస్టు - క్రికెట్ బుకీలు

ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తోన్న 7 గురిని జమ్మలమడుగు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ. 2 లక్షల 30 వేల నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి, నిందితులను రిమాండ్​కు పంపినట్లు డీఎస్పీ కె.కృష్ణన్ తెలిపారు.

7 గురి బుకీల అరెస్టు

By

Published : May 13, 2019, 6:38 AM IST

Updated : May 13, 2019, 8:46 AM IST

7 గురి బుకీల అరెస్టు

కడప జిల్లా జమ్మలమడుగులో 7 గురు క్రికెట్ బుకీలను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.2 లక్షల 30 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్​పై క్రికెట్ బెట్టింగ్ నిర్వహించిన వీరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ సందర్భంగా డీఎస్పీ కే.కృష్ణన్ మాట్లాడుతూ..క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 7గురిని పక్కా ప్రణాళికతో పట్టుకున్నామని తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి, రిమాండ్ తరలిస్తున్నట్లు డీఎస్పీ చెప్పారు.

ఇవీ చూడండి :ఈ ముఠా రాష్టానికి పరిమితం కాదు..దేశవ్యాప్తం!

Last Updated : May 13, 2019, 8:46 AM IST

ABOUT THE AUTHOR

...view details