CPI Binay Vishwam's letter to CM Jagan: తుపాను సహాయక చర్యల సన్నద్ధతపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. సీపీఐ జాతీయ నేత, రాజ్యసభ సభ్యుడు బినయ్ విశ్వం సీఎం జగన్‌కు లేఖ రాశారు. ఉక్కు పరిశ్రమ సాధన కోసం సీపీఐ నేతలు చేపట్టిన పాదయాత్రలో పాల్గొనడానికి వైఎస్సార్ జిల్లా వచ్చిన ఆయన.. కడప నగర ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని స్వయంగా పరిశీలించారు.
తుపాను సన్నద్ధత చర్యలు ఇవేనా..! సీఎం జగన్ కు సీపీఐ ఎంపీ లేఖ - Failure of disaster management system
CPI Binay Vishwam's letter to CM Jagan: మాండౌస్ తుపాన్ ప్రభావంతో రాయలసీమ జిల్లాలో జనజీవనం అస్తవ్యస్తమయ్యింది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రభుత్వం సహాయక చర్యలలో విఫలమయ్యింది..దీంతో అసంతృప్తి చెందిన సీపీఐ జాతీయ నేత రాజ్యసభ సభ్యుడు బిన్వయ్ విశ్వం సీఎం జగన్‌కు లేఖ రాశారు..
అనంతరం కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని కాల్ సెంటరును సందర్శించగా అక్కడ నలుగురు ఉద్యోగులు మినహా ఎవరూ లేరని లేఖలో పేర్కొన్నారు. రెండో శనివారం కావడంతో ఎవరూ లేరన్న సమాధానం వచ్చిందని, కలెక్టర్‌కు సెల్‌ఫోన్ ద్వారా సందేశం పంపినా ఎలాంటి సమాధానం రాలేదని వివరించారు. మీ ప్రభుత్వ హయాంలో విపత్తు నిర్వహణ వ్యవస్థ పూర్తిగా విఫలమవడం బాధాకరమని, పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకొని, అవసరమైన చర్యలు చేపట్టాలని సీఎంకు పంపిన ఆ లేఖలో బినయ్ విశ్వం పేర్కొన్నారు.
ఇవీ చదవండి: