కడపలోని సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా అన్నారు. గ్రంథాలయ వార్షిక బడ్జెట్ పెంపుతో పాటు నూతన భవనాల నిర్మాణం చేపడతామన్నారు. కడప సీపీ బ్రౌన్ గ్రంథాలయం పాతికేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రజతోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన.. జ్యోతిప్రజల్వన చేసి ప్రారంభించారు. కడప కేంద్రంగా ఆంగ్లేయుడైన సీపీ బ్రౌన్ తెలుగు భాష కోసం ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. రజతోత్సవాల సందర్భంగా ప్రత్యేక సంచికలను ఆవిష్కరించారు.
సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రాన్ని అభివృద్ధి చేస్తాం: డిప్యూటీ సీఎం - deputy cm amjad basha latest news
కడప సీపీ బ్రౌన్ గ్రంథాలయం పాతికేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రజతోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం అంజాద్ బాషా హాజరయ్యారు. సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ఆయన అన్నారు.
cp brown silver jubilee celebration