ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రొద్దుటూరు మెప్మాలో అవినీతి కంపు..? - క‌డ‌ప జిల్లా

మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ప్రవేశపెట్టిన మెప్మాలో... అవినీతి రాజ్యమేలుతోంది. క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరులో మెప్మా వ్య‌వ‌స్థ అధ్వానంగా త‌యారైంది. పేద‌రిక నిర్మూల‌న‌కు త‌క్కువ వ‌డ్డీతో రుణాలిచ్చి... వ్యాపారం పెట్టించి పేద మ‌హిళ‌ల జోవ‌నోపాధి కల్పించడానికి మెప్మాను ప్ర‌వేశ‌పెట్టారు. కేత్ర‌స్థాయిలో ఈ కార్యక్రమానికి మంచి పేరున్నా... కొంత మంది చేతివాటం చెడ్డ‌పేరు తెస్తోంది. మహిళల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని కొంద‌రు అడ్డగోలుగా అవినీతికి పాల్ప‌డుతున్నారు.

ప్రొద్దుటూరు మెప్మాలో అవినీతి కంపు

By

Published : May 17, 2019, 10:05 AM IST

ప్రొద్దుటూరు మెప్మాలో అవినీతి కంపు

క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరు మెప్మా ప‌రిధిలో సుమారు 2,500 స్వ‌యం స‌హాయ సంఘాలున్నాయి. సుమారు 26 వేల మందికిపైగా స‌భ్యులున్నారు. 81 మంది ఆర్పీలు, 8 మంది సీవోలున్నారు. వీరంతా కొత్త సంఘాలను అభివృద్ది చేసి... వారికి రుణాలిచ్చి స్వయం ఉపాధి పొందేలా చూడాలి. ప‌సుపు-కుంకుమ పథకం కింద... ఫిబ్ర‌వరి, మార్చి, ఏప్రిల్ నెల‌లో రూ.25 కోట్లు చెక్కుల రూపంలో సభ్యులకు ఇచ్చారు. అయితే... చెక్కులు ఇవ్వడానికి కొందరు లంచం అడిగారనే విమర్శలున్నాయి.

బ్యాంకు అనుసంధానం కింద రుణం మంజూరైతే...ఒక్కో సంఘం నుంచి ఆర్పీలు రూ. 5 వేలు వసూలు చేస్తున్నార‌ని సభ్యులు వాపోతున్నారు. రెండో ద‌ఫా ప్రభుత్వం ప‌సుపు-కుంకుమ కింద ఒక్కో స‌భ్యురాలికి రూ.10 వేలు చొప్పున మంజూరు చేసింది. ఈ నగదును ఇప్పించడానికి ఒక్కో సంఘం నుంచి రూ.1500 నుంచి రూ.2వేల వ‌ర‌కూ కమీషన్ తీసుకున్నార‌నే విమ‌ర్శ‌లు ఇప్ప‌డు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

ఆర్పీల అవినీతి భాగోతాలు ఒక్కొక్క‌టిగా వెలుగు చూస్తున్నాయి. పట్టణంలోని 24వ వార్డుకు చెందిన కొందరు స‌భ్యులు గ‌తంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రొద్దుటూరు పుర‌పాల‌క క‌మిష‌న‌ర్ ర‌మణారెడ్డి ఆదేశాల‌తో మార్చి 16న స‌హాయ క‌మిష‌న‌రు ర‌మేష్‌బాబు విచార‌ణ చేప‌ట్టారు. మార్చి 21న మెప్మా పీడీ రాధ విచార‌ణ చేయ‌గా... రూ.3.50 ల‌క్ష‌ల వరకు అవినీతికి పాల్ప‌డ్డార‌ని తేలింది.

తాజాగా... 15వ వార్డుకు చెందిన కొందరు సభ్యులు మరో ఆర్పీపై ఫిర్యాదు చేశారు. దీనిపై మెప్మా టీఈ మ‌హాలక్ష్మి విచార‌ణ చేపట్టగా... భారీ అవినీతి జ‌రిగిన‌ట్లు గుర్తించారు. దీనిపై సమగ్ర విచార‌ణ చేసేందుకు డీఆర్‌డీఏ కార్య‌ాల‌యం నుంచి ప్రత్యేక బృందం రానున్న‌ట్లు తెలుస్తోంది. 30వ వార్డుకు చెందిన మరో ఆర్పీ అవినీతికి పాల్ప‌డిన ఘటనపై విచారణ తుదిద‌శ‌కు చేరుకుంది. ఈమె కూడా సుమారు రూ.3 ల‌క్ష‌ల మేర స్వాహా చేసిన‌ట్లు తెలుస్తోంది.

ఎవరి స్థాయిలో వారు అవినీతి, అక్రమాలకు పాల్పడుతుంటే మేం ఎలా అభివృద్ధి చెందుతామంటూ... సభ్యులు ప్రశ్నిస్తున్నారు. ఉన్న‌తాధికారులు స్పందించి క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటేనే సిబ్బందిలో మార్పు వస్తుందని అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చదవండి...

భాజపా నేతల దేశభక్తి ఇదేనా?: చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details