కంటైన్మెంట్ క్లస్టర్లలో కరోనా నివారణ చర్యలను మరింత పటిష్ఠంగా అమలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ హరికిరణ్ తెలిపారు. కొవిడ్-19 వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన “కొవిడ్ ఇన్ స్టంట్ ఆర్డర్ -43లోని అంశాలను, విధి విధానాలను తప్పక పాటించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం మే 3వ తేదీన జారీ చేసిన “కొవిడ్ ఇన్స్టంట్ ఆర్డర్ -43” ప్రకారం.. కరోనా పాజిటివ్ కేసు నమోదైన వ్యక్తి ఇంటి కేంద్రంగా, 500 మీటర్లు నుంచి ఒక కిలోమీటర్ ప్రాంతాన్ని “కంటైన్మెంట్ కోర్ గానూ... 3 కిలోమీటర్ల వరకు ఉన్న ప్రాంతాన్ని “కంటైన్మెంట్ బఫర్‌గా నిర్ధారించామని వివరించారు. ఈ ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయా మున్సిపాలిటీలు, మండలాల్లో కంటైన్మెంట్ జోన్ల వివరాలను కలెక్టర్ వెల్లడించారు.
'మరింత పటిష్ఠంగా కరోనా నివారణ చర్యలు'
కడపలో కరోనా వ్యాప్తి నివారణ చర్యలను పకడ్బందీగా అమలు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. కొవిడ్ సోకిన ప్రాంతాన్ని మూడు జోన్లుగా విభజించామని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో నిషేధం కొనసాగుతుందని వెల్లడించారు.
కడప జిల్లాలో మరింత కఠినంగా లాక్డౌన్