ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 6, 2020, 10:27 AM IST

ETV Bharat / state

కరోనాతో మృతి చెంది గంటలు కావస్తున్నా.. పట్టించుకోవట్లేదు

కడప రిమ్స్​లో కరోనా వార్డులో బాధితులు ఆందోళన చెందుతున్నారు. వైరస్​తో ఓ వ్యక్తి మృతి చెంది గంటలు కావస్తున్నా... శవాన్ని తరలించడంలో ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.. అదే పడకపై శానిటైజ్ చేయకుండా... మరో రోగిని చేర్చుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

corona patient deaths in rims at kadapa
కడప రిమ్స్​లో కరోనా మృతులు

కరోనాతో చనిపోయిన మృతదేహలను ఆసుపత్రిలో అలాగే ఉంచుతున్నారు. కడప రిమ్స్ కోవిడ్ వార్డులో ఓ వక్తి మరణించగా..అతని శవాన్ని అక్కడినుంచి తీయనేలేదు అక్కడి సిబ్బంది. ప్రతి రోజు శవాల మధ్య భయపడుతూ తిరుగుతున్న కరోనా బాధితులు..... అటెండర్లు, సిబ్బందికి తరలించమని మొరపెట్టుకుంటున్నా పట్టించుకోవడం లేదని వారు వాపోయారు. 5 వతేదీ సాయంత్రం 5 గంటల సమయంలో తీవ్ర అనారోగ్యంతో వార్డులోకి వచ్చిన రోగి...చనిపోయారు. రెండు గంటల తర్వాత శవాన్ని తరలించారు. చనిపోయిన తర్వాత కనీసం బెడ్​ను కానీ, వార్డును శానిటైజ్ చేయలేదు. అదే పడకపై శానిటైజ్ చేయకుండా... మరో రోగిని చేర్చుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details