ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హోటళ్లలో కొవిడ్ వైద్యం నిర్వహణపై వామపక్షాల నిరసన - కడపలో హోటళ్లలో కరోనా వైద్యం

హోటళ్లలో కొవిడ్ వైద్యం నిర్వహణపై వామపక్షాలు కడపలో నిరసన తెలిపాయి. నిబంధనలకు వ్యతిరేకంగా వైద్యం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.హోటల్ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

Corona healing in hotels in Kadapa
హోటళ్లలో కొవిడ్ వైద్యం

By

Published : Aug 30, 2020, 11:20 AM IST

ప్రభుత్వ అనుమతులు లేకుండా హోటళ్లలో కరోనా వైద్యం నిర్వహిస్తున్నారంటూ... కడపలో వామపక్ష నేతలు నిరసన చేపట్టారు. చెన్నూరు బస్టాండ్ వద్ద ఉన్న ఓ హోటళ్లో నిబంధనలకు వ్యతిరేకంగా వైద్యం చేస్తున్నారని ఆరోపించారు. బాధితుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని.. వారి మరణాలకు కారణమవుతున్నారని విమర్శించారు. హోటల్‌ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ABOUT THE AUTHOR

...view details