ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రొద్దుటూరులో కరోనా ఉద్ధృతి - corona cases proddutur

కడప జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ప్రొద్దుటూరులో ఒక్కరోజులోనే 44 కేసులు నమోదవడం భయందోళనకు గురిచేస్తోంది.

corona cases incresed in proddutur kadapa district
ప్రోద్దుటూరులో కరోనా ఉధృతి

By

Published : Jun 27, 2020, 10:22 AM IST

కడప జిల్లా ప్రొద్దుటూరులో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. తాజాగా 24 గంటల్లోనే 44 కేసులు నమోదవ్వడం భయందోళనకు గురిచేస్తోంది. ఒక్క నడింపల్లి వీధిలోనే 30 మంది కరోనా బారిన పడ్డారు. వెంకటేశ్వర్లపేట, వైఎంఆర్ కాలనీ, మట్టి మసీదు వీధి, దస్తగిరిపేట, లింగాపురం, ఖాద‌ర‌బాదు, మూల‌వారిప‌ల్లె ప్రాంతాల్లో 14 కేసులు న‌మోద‌య్యాయి.

దీంతో మెుత్తం కేసుల సంఖ్య 183కు చేరింది. కేసులు నమోదైన వీధుల్లో ప‌రిశుభ్ర‌త ప‌నులు చేస్తున్నారు. ప్ర‌జ‌లు భౌతిక దూరం పాటించ‌డంతో పాటు మాస్కులు త‌ప్ప‌నిస‌రిగా ధ‌రించాల‌ని సూచిస్తున్నారు. ప్ర‌తి ఒక్క‌రూ బాధ్య‌తగా వ్య‌వ‌హ‌రిస్తేనే వైర‌స్ క‌ట్ట‌డి సాధ్య‌మ‌వుతుంద‌ని అధికారులు చెబుతున్నారు.

ఇదీ చదవండి: సీసీఆర్​సీ పత్రాల జాప్యం...కౌలుదారులకు కష్టాలు

ABOUT THE AUTHOR

...view details