ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కొవిడ్ బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు చేపడుతున్నాం'

కడప జిల్లాలో బుధవారం 734 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కలెక్టర్ హరికిరణ్ పేర్కొన్నారు. ఇప్పటివరకు 101 మంది వైరస్​తో మరణించినట్లు తెలిపారు. కొవిడ్ బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు చేపడుతున్నామని వివరించారు.

corona cases in kadapa district
హరికిరణ్, కడప జిల్లా కలెక్టర్

By

Published : Jul 30, 2020, 8:40 AM IST

కడప జిల్లాలో కొవిడ్ బాధితులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ హరికిరణ్ అన్నారు. బుధవారం జిల్లాలో 734 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆయన తెలిపారు. 161 మంది డిశ్చార్జి అయ్యారని చెప్పారు.

ఇప్పటివరకు కరోనాతో 101 మంది మృతిచెందినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఎలాంటి లక్షణాలు లేకుండా పాజిటివ్ వచ్చిన 718 మంది హోం ఐసోలేషన్​లో ఉన్నట్లు తెలిపారు. క్వారంటైన్ కేంద్రాల్లో 147 మంది ఉన్నారన్నారు. వారందరిపై ప్రత్యేక పర్యవేక్షణ ఉందని చెప్పారు.

జిల్లాలో మొత్తం ఆసుపత్రుల్లో కలిపి 3100 పడకలు కొవిడ్ బాధితుల కోసం అందుబాటులో ఉన్నాయన్నారు. కొవిడ్​పై ఏదైనా సమాచారం కావాలంటే కంట్రోల్ రూమ్ నెంబర్లు 08562-245259, 259179 లకు ఫోన్ చేయవచ్చని వివరించారు. టెలీ కన్సల్టెన్సీ కోసం 08562-244070కు కాల్ చేసి వైద్య సలహాలు పొందవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు.

ఇవీ చదవండి...

వివేకా హత్య కేసు: కీలక సమాచారం రాబట్టిన సీబీఐ!

ABOUT THE AUTHOR

...view details