BRAHMAM GARI MATAM TEMPLE : వైఎస్ఆర్ జిల్లా బ్రహ్మంగారి మఠం ఆలయంలో మళ్లీ వివాదం మొదలైంది. పీఠాధిపతి లేకుండానే ఆలయ ధ్వజస్తంభం ప్రతిష్టాపన ఎలా చేస్తారంటూ.. దివంగత పీఠాధిపతి భార్య మారుతి మహాలక్ష్మి, ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ జిల్లా బ్రహ్మంగారి మఠం ఆలయంలో ద్వజ స్తంభం ప్రతిష్ఠ కార్యక్రమాన్ని దివంగత పీఠాధిపతి భార్య మారుతి మహాలక్ష్మి, స్థానికులతో కలిసి అడ్డుకున్నారు. గురువారం ద్వజస్తంభం ప్రతిష్ఠ మహోత్సవం నిర్వహిస్తున్న సందర్భంలో మంగళవారం నుంచి పూజ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ప్రశ్నించిన మారుతి మహాలక్ష్మి: పీఠాధిపతి లేకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తారని మారుతి మహాలక్ష్మి ప్రశ్నించారు. స్థానికులతో కలిసి ఆమె పూజా కార్యక్రమాలను అడ్డుకున్నారు. పూజా కార్యక్రమాలను నిర్వాహకులు, పండితులు తాత్కాలికంగా నిలిపివేశారు. పిట్ పర్సన్‌గా ఉన్న శంకర్ బాలాజీ కేవలం ఆలయం పర్యవేక్షణ మాత్రమే చూసుకోవాలని... ఆధ్యాత్మిక కార్యక్రమాలు పీఠాధిపతి పర్యవేక్షణలో చేయాలని మారుతి మహాలక్ష్మి స్పష్టం చేశారు. కనీసం మాకు సమాచారం ఇవ్వకుండా చేస్తున్నారు. ఇందులో నా అనుమతి లేదని రాసి ఇచ్చాను. మమల్ని సంప్రదించకుండా ఆయన ఇస్టానుసారం చేస్తున్నారు. బ్రహ్మంగారి మఠం ఆలయంలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణ నెలకొంది.