.
భాజపా మోసగాళ్ల పార్టీ: తులసిరెడ్డి - కడపలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక నాయకులు తులసి రెడ్డి మీడియా సమావేశం
దేశానికి భాజపా శనిగ్రహంలా... తెదేపా, వైకాపాలు రాహు-కేతువుల్లా దాపురించాయని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షుడు తులసిరెడ్డి కడపలో ఆరోపించారు. భాజపా మోసగాళ్ల పార్టీగా మారిందని ఎద్దేవా చేశారు. ముఖ్యంగా వైకాపా ప్రభుత్వం మోసాలకు మారుపేరుగా మారి... అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో మూడు పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని ఆయన పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసి రెడ్డి