ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ముఖ్యమంత్రి జగన్​వి నాడు వాగ్దానాలు-నేడు వాయింపులు' - వైకాపా ప్రభుత్వంపై తులసి రెడ్డి వ్యాఖ్యలు

17 నెలల కాలంలో రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి జగన్​ చేసిందేమీ లేదని కాంగ్రెస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి విమర్శించారు. మద్యం, ఇసుక, ఇంధన ధరలు, ఆర్టీసీ ఛార్జీలు, విద్యుత్ బిల్లులు పెంచి సామాన్య ప్రజల రక్తం తాగారని మండిపడ్డారు.

నాడు వాగ్దానాలు-నేడు వాయింపులు
నాడు వాగ్దానాలు-నేడు వాయింపులు

By

Published : Nov 7, 2020, 4:59 PM IST

వైకాపా పాలనపై కాంగ్రెస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 17 నెలల కాలంలో రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి జగన్​ చేసిందేమీ లేదని విమర్శించారు. వైకాపా 17 నెలల పాలనపై వారు చేపడుతున్న 'ప్రజలతో నాడు-ప్రజల కోసం నేడు' అనే కార్యక్రమానికి బదులు నాడు వాగ్దానాలు-నేడు వాయింపులు అనే పెడితే బాగుంటుందని ఎద్దేవా చేశారు.

గత 17 నెలల కాలంలో వైకాపా ప్రభుత్వం చేసిన ఏకైక కార్యక్రమం వడ్డింపులు-వాయింపులేనన్నారు. మద్యం ధరలు, ఇసుక ధరలు, ఇంధన ధరలు, ఆర్టీసీ ఛార్జీలు, విద్యుత్ బిల్లులు పెంచి సామాన్య ప్రజల రక్తం తాగారని మండిపడ్డారు. భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంచారని, కర్రీ పాయింట్ మీద కూడా వృత్తి పన్నులు విధించారన్నారు. త్వరలో జుట్టు పన్ను, గడ్డం పన్ను, బోడి గుండు పన్ను విధించినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఎద్దేవా చేశారు.

ABOUT THE AUTHOR

...view details