Tulasi Reddy Comments on KCR: ఖమ్మంలో బీఆర్ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగం పిట్టల దొర ప్రసంగంలా ఉందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్ తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. కడప జిల్లా వేంపల్లిలో తులసిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ 'అమ్మకు అన్నం పెట్టని ప్రబుద్దుడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా' అన్నట్లుంది కేసీఆర్ వాలకం అని విమర్శించారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరించలేని కేసీఆర్ దేశ సమస్యలను పరిష్కరిస్తామనడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.
గత 75 సంవత్సరాలలో దేశంలో అభివృద్ది జరగలేదనడం అవివేకం అని అన్నారు. వ్యవసాయక, పారిశ్రామిక, సమాచార, ఎలక్ట్రానిక్, రవాణా, విద్యా, వైద్యా, అంతరిక్ష రంగాలలో అద్భుతమైన ప్రగతి జరిగింది. ఎప్పటికైనా బీఆర్ఎస్, బీజేపీ తోక పార్టీ. బీఆర్ఎస్ మరో ఏంఐఎం. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ వీఆర్ఎస్ (వాలంటరీ రిటైర్మెంట్ సమితి) కాక తప్పదని తులసిరెడ్డి బీఆర్ఎస్ పార్టీకి హెచ్చరించారు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్ తులసిరెడ్డి
ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభలో బీఆర్ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి. పిట్టల దొర ప్రసంగాన్ని ఉత్తర కుమార ప్రగల్బాలను మైమరిపిస్తున్నాయి. అమ్మకు అన్నం పెట్టని ప్రబుద్దుడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అన్నట్టున్నది. 9,10 షెడ్యూల్లకు సంబంధించిన అంశాలు, గోదావరి జలాలకు సంబంధించిన అంశాలను ఎనిమిదిన్నర సంవత్సరాలుగా పరిష్కరించలేని ఈ పెద్ద మనిషి దేశ సమస్యలు పరిష్కరిస్తాడా..? ఈ 75 సంవత్సరాల్లో ఏం అభివృద్ది జరగలేదని ఆయన అనడం పిల్ల వచ్చి గుడ్డుని వెక్కిరించినట్లుంది. 1947 లో మనకు స్వాతంత్య్రం వచ్చిన నాటి పరిస్థితి ఏమిటి ఈనాటి పరిస్థితి ఏమిటి..? మచ్చుకు కొన్ని తీస్తే..ఆనాడు వ్యవసాయరంగంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి జనాభాకు సరిపడా లేక ఆకలి చావులు సంభవించాయి. ఈ రోజు హరిత విప్లవం కారణంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి ఇబ్బడి ముబ్బడిగా పెరిగి మిగులు పరిస్థితుల్లో ఉన్నాం. పారిశ్రామిక రంగంలో ఒక గుండు పిన్ను ఉత్పత్తి చేయలేని స్థాయినుంచి.. ఈ రోజు అంతరిక్షంలోకి ఒకేసారి అనేక ఉపగ్రహాలు పంపే స్థాయికి వచ్చాం. కాబట్టి అదంతా మరిచిపోయి అలా మాట్లాడటం ఏ మాత్రం సమంజసం కాదు. బీఆర్ఎస్, బీజేపీ తోకపార్టీ. బీఆర్ఎస్ మరో ఏంఐఎం. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ వీఆర్ఎస్ కాక తప్పదు.-తులసిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్
ఇవీ చదవండి: