వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్నింటి ధరలు పెంచేశారని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి అన్నారు. కడప జిల్లా వేంపల్లెలో మాట్లాడిన ఆయన.. ఓ వైపు కరోనా లాక్డౌన్తో ఉపాధిలేక ప్రజలు అల్లాడుతుంటే.. మరోవైపు జగన్ ప్రభుత్వం వారిమీద ధరల వడ్డింపు చేస్తోందని విమర్శించారు. పెట్రోల్, డీజిల్, మద్యం, ఇసుక, కరెంట్ ఛార్జీలు అన్నింటిని పెంచేసి సామాన్యుడి నడ్డి విరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ ప్రభుత్వం ధరలు పెంచడం తప్ప తగ్గించే సూచనలు కనిపించడం లేదని తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. ఇందుకేనా నేను ఉన్నాను.. నేను విన్నాను అని జగన్ అనేది అని ప్రశ్నించారు.