ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆలయ స్థలంపై వివాదం.. అధికారులు, భక్తుల మధ్య వాగ్వాదం

కడపలోని నిరంజన్​నగర్​లో దేవాలయ స్థల వివాదంలో... స్థానికులకు, ప్రభుత్వ అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది. ప్రభుత్వ స్థలమని అధికారులు.. కాదు విరాళాల రూపంలో సేకరించిన స్థలం అని స్థానికులు వాగ్వాదానికి దిగారు. భారీ సంఖ్యలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

స్థానికులకు, ప్రభుత్వ అధికారుల మధ్య ఉద్రిక్తత
స్థానికులకు, ప్రభుత్వ అధికారుల మధ్య ఉద్రిక్తత

By

Published : Jun 24, 2021, 5:26 PM IST

కడపలోని నిరంజన్​నగర్​లో 2014లో ప్రభుత్వం అన్నపూర్ణేశ్వరి గుడికి, కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానానికి.. 20 సెంట్ల స్థలం కేటాయించారు. స్థానికంగా ఉన్న వారందరూ చందాలు వేసుకొని ఆ స్థలాన్ని అభివృద్ధి చేసి చుట్టూ ప్రహరీ నిర్మించారు. అధికారులు వచ్చి ఈ స్థలంలో ప్రభుత్వానికి సంబంధించిన గ్రామ సచివాలయం, అర్బన్ హెల్త్ సెంటర్ నిర్మించాలంటూ చెప్పారు. దీంతో అధికారులు, స్థానికులకు మధ్య ఉద్రిక్తత ఏర్పడింది. ప్రహరీ తొలగించేందుకు వెళ్లిన అధికారులను స్థానికులు అడ్డుకున్నారు.

కొద్దిసేపు అక్కడ తోపులాట చేసుకుంది. ప్రహరీ నిర్మించిన సమయంలో అధికారులు ఏంచేస్తున్నారని స్థానికులు ప్రశ్నించారు. ఇది గతంలో ప్రభుత్వమే తమకు ఇచ్చిందని స్థానికంగా ఉన్న కొంచెం స్థలాన్ని ఇవ్వడంతో దేవాలయాలను నిర్మిస్తున్నామని స్థానికులు చెప్పారు. అధికారులు వచ్చి దౌర్జన్యం చేయడం మంచి పద్దతి కాదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ స్థలంలో గుడి నిర్మించారంటూ తహసీల్దార్ శివశంకర్ రెడ్డి చెప్పారు. చివరిగా నాలుగు సెంట్ల భూమిని స్థానికులకు కేటాయించి మిగిలిన స్థలంలో సచివాలయం, అర్బన్ హెల్త్ సెంటర్ నిర్మించునున్నట్లు సమాచారం.

ABOUT THE AUTHOR

...view details