కడప నగరంలో రహదారుల విస్తరణకు ప్రణాళికలు వేగవంతం చేయాలని రెవెన్యూ, నగరపాలిక అధికారులకు కలెక్టర్ హరికిరణ్ ఆదేశాలు జారీ చేశారు. గురువారం నగరంలోని రైల్వేస్టేషన్ రోడ్డు, రిమ్స్‌కు వెళ్లే రహదారులను జాయింట్ కలెక్టర్ ( అభివృద్ధి) సాయికాంత్ వర్మతో కలిసి పరిశీలించారు. నగర అభివృద్ధి, సుందరీకరణ పనుల్లో భాగంగా రైల్వే స్టేషన్ నుంచి రిమ్స్ మార్గంలోని రైల్వే వంతెన వరకు 90 అడుగుల వెడల్పుతో నూతన రోడ్డును రూ. 15 కోట్ల నిధులతో చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు, ఆక్రమిత స్థలాలను, కట్టడాలను వెంటనే గుర్తించాలన్నారు. ఆర్డీవో మలోల, నగరపాలక కమిషనర్ లవన్న, కడప తహసీల్దారు శివరామిరెడ్డి, సీకేదిన్నె తహసీల్దార్ మహేశ్వరరెడ్డి పాల్గొన్నారు.
రోడ్డు విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేయండి
కడప నగర అభివృద్ధి, సుందరీకరణ పనుల్లో భాగంగా రహదారుల విస్తరణకు ప్రణాళికలు వేగవంతం చేయాలని అధికారులకు కలెక్టర్ ఆదేశాలిచ్చారు. రైల్వేస్టేషన్ రోడ్డు, రిమ్స్‌కు వెళ్లే రహదారులను జాయింట్ కలెక్టర్‌తో కలిసి పరిశీలించారు.
నగరంలో రహదారుల విస్తరణకు ప్రణాళికలు