ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'జిల్లా ఆర్థిక ప్రగతికి పరిశ్రమలే ఆయువుపట్టు' - కడపలో కలెక్టర్ హరికిరణ్ సమీక్ష సమావేశం వార్తలు

కడప కలెక్టరేట్​లో కలెక్టర్ హరికిరణ్ ఆధ్వర్యంలో పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహక రాయితీ సొమ్మును వివిధ యూనిట్లకు కలెక్టర్​ మంజూరు చేశారు.

collector hari kiran review meetins smses incentive discounts in kadapa
హరికిరణ్, కడప కలెక్టర్

By

Published : Jul 10, 2020, 9:56 AM IST

కడప జిల్లా ఆర్థిక ప్రగతికి పరిశ్రమలే ఆయువుపట్టు అని కలెక్టర్ హరికిరణ్ అన్నారు. కలెక్టరేట్​లో పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో 151 యూనిట్లకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహక రాయితీ మొత్తం రూ.8.88 కోట్లు విడుదలైందని చెప్పారు.

ఇందులో ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు సంబంధించిన 130 యూనిట్లకు దాదాపు రూ.7 కోట్ల 30 లక్షలు మంజూరు చేశామని తెలిపారు. జనరల్ కేటగిరీ కింద 7 యూనిట్లకు పావలా వడ్డీతో రూ.22 లక్షల 50 వేలు మంజూరు చేశామన్నారు.

ABOUT THE AUTHOR

...view details