అధికారుల తీరుపై మండిపడ్డ కలెక్టర్ హరికిరణ్
స్పందన కార్యక్రమంలో అధికారుల తీరుపై కలెక్టర్ హరికిరణ్ మండిపడ్డారు. ఫిర్యాదులపై ఉదాసీనంగా వ్యవహరించిన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఫిర్యాదులపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
collector-fire-on-dist-officers-for-public-issues
ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమంలో...అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని...కడప జిల్లా కలెక్టర్ హరికిరణ్ హెచ్చరించారు.ప్రజల ఫిర్యాదుల విషయంలో...ఉదాసీనంగా వ్యవహరించొద్దని అన్నారు.స్పందన కార్యక్రమాన్ని...ముఖ్యమంత్రి ప్రతివారం సమీక్షిస్తున్నారనే విషయం గుర్తు పెట్టుకోవాలని సూచించారు.గతవారం ఫిర్యాదులకు సంబంధించి...గృహనిర్మాణశాఖ అధికారుల తీరుపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.