ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మా సమస్యలపై సీఎం స్పందించాలి.. పరిష్కరించాలి'

తమ సమస్యలు పరిష్కారించాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాలు సమైక్యంగా... కడప కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టాయి. ప్లకార్డులతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Coalition dharna of AP teacher unions to resolve issues
సమస్యలు పరిష్కరించాలని ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమైక్య ధర్నా

By

Published : Oct 12, 2020, 9:47 PM IST

తమ సమస్యలు పరిష్కారించాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల నేతలు.. సమైక్యంగా ధర్నాకు దిగారు. కడప కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. ప్లకార్డులతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉపాధ్యాయుల అక్రమ బదిలీలు జరుగుతున్నాయని, డబ్బులు తీసుకుని ఇష్టానుసారంగా పోస్టింగులు కేటాయిస్తున్నారని ఆరోపించారు.

జగనన్న విద్యా కానుక అస్తవ్యస్తంగా మారిందని విమర్శించారు. నాడు - నేడు పనుల్లో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయని ధ్వజమెత్తారు. రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ కార్యదర్శి.. విద్యాశాఖను సర్వనాశనం చేస్తున్నారని, సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లకుండా నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి ఉపాధ్యాయ సంఘాల నాయకులతో చర్చలు జరపాలని లేదంటే విద్యాశాఖలో జరిగే అవినీతి అక్రమాలు తారాస్థాయికి చేరే అవకాశం ఉందని పేర్కొన్నారు.

For All Latest Updates

TAGGED:

dharna

ABOUT THE AUTHOR

...view details