ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 26, 2020, 2:01 PM IST

ETV Bharat / state

కరోనా నివారణ చర్యలకు ఎంపీ సీఎం రమేశ్ భారీ విరాళం

యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వ్యాప్తి నివారణకు కేంద్ర, రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యల నేపథ్యంలో.. ప్రజాప్రతినిధుల నుంచి విరాళాలు వెల్లువెతున్నాయి. భారీ విరాళం ఇచ్చేందుకు రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ముందుకొచ్చారు.

kadapa district
కరోనా నివారణకు భారీ విరాళం ఇస్తున్న సీఎం రమేశ్

కరోనా వ్యాప్తి నివారణ చర్యలు చేపడుతున్న ప్రభుత్వానికి సాయంగా దాతలు భారీ విరాళాలతో ముందుకు వస్తున్నారు. రాజ్యసభలో భాజపా సభ్యుడు సీఎం రమేష్ 4.5 కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటించారు. ఎంపీ ల్యాడ్స్ నుంచి 2 కోట్ల రూపాయలను ప్రధానమంత్రి జాతీయ నిధికి, ఒక్కో కోటి చొప్పున ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి.. మరో 50 లక్షల రూపాయలను కడప జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లోని రోగుల వైద్య పరీక్షలకు ఇస్తున్నట్టు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details