ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఎం జగన్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ, కలెక్టర్ - సీఎం జగన్ పర్యటన తాజా వార్తలు

కడప జిల్లా బద్వేలులో ఈనెల 9న ముఖ్యమంత్రి జగన్ పర్యటించనున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లను ఎంపీ అవినాశ్, కలెక్టర్ హరికిరణ్ పరిశీలించారు. సభాస్థలి, హెలీప్యాడ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు.

CM Jagan tour arrangements at badwel
సీఎం జగన్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ, కలెక్టర్

By

Published : Jul 4, 2021, 9:19 PM IST

ఈనెల 9న ముఖ్యమంత్రి జగన్ కడప జిల్లా బద్వేలులో పర్యటించనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను ఎంపీ అవినాశ్, జిల్లా కలెక్టర్ హరికిరణ్ ఇవాళ పరిశీలించారు. ఇటీవల రెండు రోజులు వర్షం కురవటంతో ఇదివరకు ఎంపిక చేసిన సభాస్థలి, హెలిప్యాడ్ ప్రాంగంణంలో నీరు నిలిచింది. దీంతో హెలీప్యాడ్​ను సిద్ధవటంలోని మరో ప్రాంతానికి, సభాస్థలిని పోరుమామిళ్ల బైసాస్​ రోడ్డుకు మార్పు చేశారు.

వేదిక ఏర్పాటు పనులు త్వరగా పూర్తి చేయాలని క్షేత్రస్థాయి అధికారులను వారు ఆదేశించారు. ఏర్పాట్లను పరిశీలించిన వారిలో జిల్లా సంయుక్త కలెక్టర్ గౌతమి, రాజంపేట ఆర్డీవో కేతన్ గార్గి, మాజీ ఎమ్మెల్సీ డీసీ గోవింద్ రెడ్డి, మార్కెట్ యార్డ్ వైస్ ఛైర్మన్ రమణా రెడ్డి తదితరులు ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details