కడప జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి జగన్ ఇవాళ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. దాదాపు 4 వేల కోట్ల రూపాయలతో చేపట్టే.. గండికోట - చిత్రావతి, గండికోట - పైడిపాలెం ఎత్తిపోతల పథకాలకు సీఎం శంకుస్థాపన చేశారు. 1257 కోట్లతో చేపట్టే సూక్ష్మసేద్యం పనులు, ఏపీ కార్లలో ఇర్మా ప్రాజెక్టు, ఏపీఐఐసీ స్థలంలో నిర్మించే... అపాచీ లెదర్ పార్కులకు శంకుస్థాపన చేశారు. పులివెందుల నియోజకవర్గంలో దెబ్బతిన్న రోడ్లు భవనాలశాఖ, పంచాయతీ రాజ్ రహదారుల మరమ్మతులకు... నిధులు మంజూరు చేస్తూ శిలాఫలకాలు వేశారు. గండి క్షేత్రం అభివృద్ధి పనులకు, పులివెందులలో 7 దేవాలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేశారు. 34 కోట్లతో 12 ఎకరాల్లో నిర్మించనున్న నూతన ఆర్టీసీ బస్టాండు, డిపోకు సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన జగన్ గతేడాది శిలాఫలకాలు వేసిన అభివృద్ధి పనులు.. ఫిబ్రవరి, మార్చిలోపు పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు.
పులివెందుల పట్టణంలో వివిధ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ముఖ్యమంత్రి.. తిరిగి ఇడుపులపాయ చేరుకున్నారు. ఈ రాత్రికి అక్కడే బస చేయనున్న సీఎం.. రేపు ఉదయం పులివెందుల సీఎస్ఐ చర్చిలో కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్ వేడుకుల్లో పాల్గొంటారు.