కడప జిల్లా అట్లూరులోని గంగమ్మ ఆలయంలో చోరీ జరిగింది. రెండున్నర లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు, ఇతర వస్తువులను దుండగులు దోచుకెళ్లారు. గంగమ్మకు భక్తులు సమర్పించిన బంగారు ఆభరణాలు, హుండీలో నగదు రెండు సీసీ కెమెరాలను ఎత్తుకెళ్లినట్లు.. ఆలయ నిర్వాహకులు అట్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొంగల జాడను గుర్తించేందుకు పోలీసు జాగిలలతో సంఘటన స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. వేలిముద్రల నిపుణులు వేలిముద్రలను తీశారు. నిందితులు గుర్తించేెందుకు పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు.
గంగమ్మ ఆలయంలో చోరీ..
కడప జిల్లా అట్లూరులోని గంగమ్మ ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. భక్తులు సమర్పించిన బంగారు ఆభరణాలు, హుండీలో నగదు రెండు సీసీ కెమెరాలను ఎత్తుకెళ్లినట్లు ఆలయ నిర్వహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. జాగిలలతో సంఘటన స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు.
chori in gangamma temple
ఇవీ చూడండి…