కడప నెహ్రూనగర్‌లో చింటూ అనే 10 ఏళ్ల బాలుడు ఇంట్లో చీరతో ఊయల వేసుకుని ఊగుతున్నాడు. ప్రమాదవశాత్తు చీర గుడ్డ బాలుడి మెడకు బిగుసుకుంది. అరిచే వీల్లేకుండా చుట్టుకుంది.
ఇంట్లోఉన్న వారెవరూ బాలుడిని గమనించ లేదు. కాసేపటికి తల్లిదండ్రులు చూశారు. కంగారు పడి ఆసుపత్రికి తరలించారు. రిమ్స్ వైద్యులు ఆ బాలుడిని పరీక్షించి... అప్పటికే చనిపోయినట్టు నిర్దరించారు. ఈ ఘటన ఆ ఊరిలో విషాదం నింపింది.