ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైద్యులు కాలు పోగొట్టారు... కనికరించండి

రోడ్డు ప్రమాదంలో కాలిరిగింది . బాగు చేయండి అని వెళ్తే కాలు పోగొట్టారు ప్రైవేటు వైద్యులు . రెండేళ్లుగా మంచానికే పరిమితమయ్యారు . ఆరోగ్యంగా ఉన్నప్పుడు సంపాదించు కున్న ఆస్తిపాస్తులు వైద్యానికి ఖర్చుచేసి చికిత్సలకు డబ్బులేక బాధపడుతున్నాడు. సాయం చేసే ఉదారమైన దాతల కోసం ఎదురుచూస్తున్నారు

వైద్యులు కాలు పోగొట్టారు... కనికరించండి

By

Published : Aug 1, 2019, 12:29 PM IST

రోజుకు 500 రూపాయల కూలి... ఓ భార్య, నలుగురు పిల్లలు, తల్లి... ఏ చింతా లేకుండా సంతోషంగా ముందుకు సాగుతున్న కుటుంబాన్ని... ఒక ప్రమాదం, డాక్టర్ల నిర్లక్ష్యం చిన్నాభిన్నం చేశాయి. కడప జిల్లా బద్వేలు రామాంజనేయ నగర్​లో ఉన్న చంద్రశేఖర్​ పెయింటర్​గా పని చేసే వాడు. రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో కాలు విరిగింది. ప్రైవేటు వైద్యులు నిర్లక్ష్యంతో కాలంతా ఇన్ఫెక్షన్​ సోకి మంచానికి పరిమితమయ్యాడు.
కష్టపడి సంపాదించుకున్న స్థలం, ఇళ్లు వైద్యం కోసం అమ్ముకున్నారు. ఆర్టీసీలో స్వీపర్​గా పని చేస్తున్న తల్లే ఇంటికి ఆధారమైంది... దేవుడు కన్నెరజేసినట్లు... గోడకు సున్నం వేస్తూ కింద పడి గాయపడింది. దీనితో వైద్య ఖర్చులకు డబ్బులు లేక సాయం చేసే ఉదారమైన దాతల కోసం ఆ కుటుంబం ఎదురు చూస్తోంది.

వైద్యులు కాలు పోగొట్టారు... కనికరించండి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details