కడప జిల్లా అదనపు ఎస్పీ చక్రవర్తి ఆదేశాల మేరకు రైల్వేకోడూరులో మంగళవారం నాటుసారా స్థావరాలపై అధికారులు దాడులు జరిపారు. ఎస్ఈబీ అధికారి రామ్మోహన్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో బాలిరెడ్డి పల్లె హరిజనవాడలో చలపతి అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతని వద్ద నుంచి 10 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో ఇన్స్పెక్టర్ రామ్మోహన్‌తో పాటు హెడ్ కానిస్టేబుల్ మోహన్ రెడ్డి, కానిస్టేబుల్ శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
రైల్వేకోడూరులో నాటుసారా అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్ - రైల్వేకోడూరు తాజా వార్తలు
బాలిరెడ్డి పల్లె హరిజనవాడలో నాటుసారా అమ్ముతున్న చలపతి అనే వ్యక్తిని ఎస్ఈబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇతని వద్ద నుంచి 10 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు.
10 లీటర్ల నాటుసారా స్వాధీనం