కడప పెద్ద దర్గాలో ఘనంగా ఉరుసు - pedda darga utsvalu
కడప పెద్ద దర్గా ఉరుసు మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రాత్రి అఖిలభారత 77వ కవి సమ్మేళనం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ముంబైకి చెందిన ప్రముఖ సింగర్ సుఖేందర్ సింగ్ హాజరయ్యారు. దేశ నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వచ్చారు. కవి సమ్మేళనంలో కవులు తమదైన శైలిలో అలరించారు. దర్గా ఆవరణలో రంగురంగుల దీపాల కాంతులు విరజిల్లాయి.