కాలజ్ఞాన కర్త పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సజీవ సమాధి అయిన కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో స్వామి వారి ఆరాధనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వైశాఖ శుద్ధ దశమినాడు బ్రహ్మంగారు సజీవ సమాధి నిష్ట వహించిన రోజు కావడంతో మంగళవారం మఠం పీఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి సింహాసనంపై ఆసీనులై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఆరోజు దాదాపు లక్షమంది భక్తులు హాజరుకానుండటంతో ఆలయ నిర్వహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.
ఘనంగా ప్రారంభమైన బ్రహ్మంగారి ఆరాధనోత్సవాలు - kadapa
కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో స్వామి వారి ఆరాధనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మంగళవారం మఠం పీఠాధిపతి వీరభోగ వసం వెంకటేశ్వర స్వామి సింహాసనంపై ఆసీనులై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
ఘనంగా ప్రారంభమైన బ్రహ్మంగారి ఆరాధనోత్సవాలు