విషాదాంతం : అదృశ్యమైన బాలుడు మృతి - కడప జిల్లా నేర వార్తలు
22:02 August 09
కంపచెట్లలో బాలుడు తనీష్‌రెడ్డి (9) మృతదేహం
కడప జిల్లా రాజుపాలెం మండలంలో అదృశ్యమైన బాలుడి కథ విషాదాంతమైంది. వెంగలాయపల్లెలో కంపచెట్లలో బాలుడు తనీష్‌రెడ్డి (9) శవమై తేలాడు. ఈ నెల 7సాయంత్రం నుంచి తమ కుమారుడు కనిపించడకపోవడంతో తల్లిదండ్రులు శోభారాణి, సంజీవరెడ్డిలు చుట్టుపక్కలా బాలుడి ఆచూకీ కోసం వెతికారు. అదే రోజు రాజుపాళెం పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు.
అయితే రెండు రోజుల వ్యవధిలోనే అదృశ్యమైన బాలుడు అదే గ్రామంలోనే శవమై కనిపించడం అందరినీ ఆందోళనకు గురిచేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. తనీష్ రెడ్డి మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు.. బాలుడిని హత్య చేసినట్లు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీచదవండి.