కడప జిల్లా జమ్మలమడుగు మండలంలో బాంబు కలకలం రేపింది. మండల పరిధిలోని సుగుమంచిపల్లె పొలంలో రైతు పనులు చేస్తుండగా బాంబును గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సుగుమంచిపల్లె గ్రామానికి వెళ్లి పరిశీలించారు. కడప నుంచి పోలీసు డాగ్ స్క్వాడ్‌ను రప్పించి సుగుమంచిపల్లె ప్రాంతమంతా గాలించారు. ఒక బాంబును కనుగొన్నట్లు జమ్మలమడుగు పట్టణ సీఐ మధుసూదన్ రావు తెలిపారు.
జమ్మలమడుగులో బాంబు కలకలం - bomb in jammalamadugu
కడప జిల్లా జమ్మలమడుగు మండలంలో బాంబు కలకలం రేపింది. ఒక బాంబును కనుగొన్నామని పోలీసులు తెలిపారు. కానీ స్థానికులు కథనం మాత్రం మరోలా ఉంది.
జమ్మలమడుగులో బాంబు కలకలం
కానీ స్థానికుల కథనం వేరేలా ఉంది. మొత్తం మూడు బకెట్లలో 30 బాంబులను పోలీసులు గుర్తించారని సమాచారం. పోలీసులు మాత్రం ఆ విషయాన్ని కొట్టిపారేస్తున్నారు. బాంబు గురించి తెలిసిన స్థానికులు పలు విధాలుగా చర్చించుకున్నారు.
ఇదీ చదవండిజమ్మలమడుగులో ఎమ్మార్పీఎస్ నాయకుల ఆందోళన