BJYM BIKE RALLY: సీఎం వైఎస్ జగన్ వచ్చే ఎన్నికల్లో జమ్మలమడుగులో ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడితే ఆయనను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని, పోటీలో దిగడానికే ఇక్కడికి వచ్చానని మాజీ మంత్రి, భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యానించారు. బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు మల్లెల శ్రావణ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో శనివారం వైయస్‌ఆర్ జిల్లా జమ్మలమడుగులో యువ సంఘర్షణ యాత్ర జరిగింది. వందల మంది కార్యకర్తలు దానవులపాడు నుంచి ద్విచక్ర వాహనాల్లో పాత బస్టాండ్‌లోని గాంధీ కూడలి వరకు ర్యాలీగా వచ్చారు.
జగన్ జమ్మలమడుగులో పోటీచేస్తే.. ఎదుర్కొంటా: భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు - ఏపీ ముఖ్యవార్తలు
BJYM BIKE RALLY: ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌కి భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి సవాల్ విసిరారు. జమ్మలమడుగులో ఎమ్మెల్యే అభ్యర్థిగా జగన్ బరిలోకి దిగితే ఆయనను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నానని వ్యాఖ్యానించారు.
జగన్ మూడేళ్ల పాలనలో రాష్ట్రం అప్పుల కుంపటిగా మారిందని, ఆయన ఇంటికి వెళ్లే సమయం దగ్గర పడిందని ఆదినారాయణరెడ్డి అన్నారు. వైకాపా నాయకులను సాగనంపేందుకు వీలైతే ఇతర రాజకీయ పార్టీలను ఏకంచేసి ఇప్పుడున్న 151 నుంచి 15 స్థానాలకే పరిమితం చేస్తామన్నారు. దేశమంతటా భారత రాజ్యాంగం నడుస్తుంటే మన రాష్ట్రంలో భారతి రాజ్యాంగం అమలవుతోందని ఆరోపించారు. తనకు సంబంధం లేకున్నా మాజీ మంత్రి వివేకా హత్య కేసులో నిందితుడిగా ఇరికించేందుకు ప్రయత్నం చేసి అప్పటి ఎన్నికల్లో లబ్ధి పొందారని వాపోయారు. మూడేళ్ల కిందట కన్యతీర్థం వద్ద వైఎస్సార్ పేరిట శంకుస్థాపన చేసిన ఉక్కు పరిశ్రమను గాలికొదిలేశారని విమర్శించారు.
ఇవీ చదవండి: