మాజీమంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రమేయం ఉంటే తనని కూడా ఉరి తీయవచ్చని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆది నారాయణ రెడ్డి సవాల్ విసిరారు. మంగళవారం కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలో మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
నా ప్రమేయం ఉంటే ఉరి తీయండి: ఆది నారాయణరెడ్డి - జమ్మలమడుగు వార్తలు
ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో భాగంగా...కడప జిల్లా జమ్మలమడుగులో భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆది నారాయణ రెడ్డి మెుక్కలు నాటారు. వివేకా హత్యకేసులో తన ప్రమేయం ఉందని భావిస్తే ఉరితీయొచ్చని అన్నారు.
భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆది నారాయణ రెడ్డి
ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో భాగంగా... ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. వివేకా హత్య కేసులో నిందితులు ఎవరైనా సరే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదినారాయణ రెడ్డి డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది రథం దహన ఘటన ప్రభుత్వానికి తెలిసే జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:భైరవకోనకు వెళ్లి... నీటిలోనే చిక్కుకుని.. చివరికి..!