ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 31, 2021, 12:12 PM IST

ETV Bharat / state

REPOLLING DEMAND: 28 కేంద్రాల్లో రీపొలింగ్​ జరపాలి: సోము వీర్రాజు

బద్వేలులో ఓటమి భయంతోనే.. వైకాపా దౌర్జన్యాలకు తెరలేపిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. 28పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ కోరుతూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పలు పోలింగ్ కేంద్రాలలో.. వైకాపా నేతలు దొంగ ఓట్లు వేయించారని.. భాజపా ఏజెంట్లను బలవంతంగా బయటకు పంపించారని ఆరోపించారు.

bjp leader somu veeraju and ex minister adinarayana reddy fires on ycp over badvel bypoll
బద్వేల్‌లో వైకాపాకు ఓటమి భయం: సోము వీర్రాజు

బద్వేల్‌లో వైకాపాకు ఓటమి భయం

కడప జిల్లా బద్వేల్(badvel) ఉపఎన్నికలో ఓటమి భయంతో వైకాపా దౌర్జన్యాలకు తెరలేపిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు(somu veeraju), మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి(adi narayana reddy) ఆరోపించారు. 28 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్(repolling) కోరుతూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు. దొంగ ఓట్లు వేసుకునేవారికి భాజపాను విమర్శించే హక్కు లేదన్నారు. పలు పోలింగ్ కేంద్రాలలో.. వైకాపా నేతలు దొంగ ఓట్లు వేయించారని, పోలీసులు కూడా దొంగ ఓట్లను పట్టించుకోలేదని ఆరోపించారు.

53 శాతం కంటే ఎక్కువగా పోలింగ్ జరగలేదు, కానీ 63 శాతం పోలింగ్ జరిగిందంటే దొంగ ఓట్లు పడ్డాయని అన్నారు. కడప డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి బద్వేలు నియోజకవర్గంలో కోనరాజుపల్లెలో ఏజెంట్​గా కూర్చుని.. బస్సులో ఓటర్లను తీసుకొచ్చారని మండిపడ్డారు. భాజపా ఏజెంట్లను బలవంతంగా బయటకు పంపించారని ధ్వజమెత్తారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details