కడప జిల్లా ప్రొద్దుటూరులో కరోనా సాకు చూపి కొందరు అధికారులు, ప్రజా ప్రతినిధులు డబ్బు సంపాదనే ధ్యేయంగా పనిచేస్తున్నారని భాజపా ప్రొద్దుటూరు అసెంబ్లీ కన్వినర్ కొవ్వూరు బాలచంద్రారెడ్డి ఆరోపించారు. కరోనా కేసులు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో లాక్ డౌన్ సడలింపులు ఉన్నాయని... ప్రొద్దుటూరులో మాత్రం ఇంకా కఠినం చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంక్షలు విధించడంలో ఆంతర్యం ఏమిటని బాలచంద్రారెడ్డి ప్రశ్నించారు.
'ఇక్కడే లాక్డౌన్ కఠినం ఎందుకు..?' - lockdown down news proddutur
రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువ ఉన్న ప్రాంతాలలో లాక్డౌన్కు సడలింపులిచ్చి... ప్రొద్దుటూరులో మాత్రం లాక్డౌన్ మరింత కఠినం చేయడంపై భాజపా ప్రొద్దుటూరు కన్వినర్ బాలచందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాట్లాడుతున్న భాజపా నేత బాలచందర్ రెడ్డి
ప్రజలు, వ్యాపారులు లాక్ డౌన్ వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా సమయంలో ప్రొద్దుటూరులో ఎవరు ఎంత సంపాదించారనే విషయంపై విచారణ జరగాల్సిన అవసరం ఉందని చెప్పారు. కేసుల పేరుతో వ్యాపారులను అధికారులు భయపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ఆగ్రహానికి గురి కాకముందే పట్టణంలో లాక్ డౌన్ సడలించాలని ఆయన కోరారు. ప్రజలకు మంచి సూచనలు ఇస్తూనే... అన్ని దుకాణాలు తెరిచేందుకు అధికారులు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.