ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఇప్పుడు అడ్డుకోకుంటే.. విద్యుత్ మీటర్లకు ఉరితాడవుతాం..' - విద్యుత్ ఛార్జీలు

వ్యవసాయ మోటార్లకు విద్యుత్​ మీటర్లు బిగించాలని చూస్తున్న ప్రభుత్వం దానిని ఉపసంహరించుకోవాలని భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు అన్నారు. విద్యుత్ మీటర్లు బిగించడం వల్ల రైతు తన హక్కును కోల్పోతాడని ఆయన తెలిపారు. దీనిని అడ్డుకోక పోతే.. విద్యుత్​ మీటర్లు రైతులకు ఉరితాడులవుతాయని చెప్పారు.

bharatiya kisan sangh state president
భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు

By

Published : Jan 8, 2021, 7:28 PM IST

వ్యవసాయ మోటర్లకు విద్యుత్ మీటర్లు బిగించే ప్రతిపాదనను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు డిమాండ్ చేశారు. విద్యుత్ వినియోగాన్ని లెక్కించడానికి ఫీడర్ల వద్ద కానీ ట్రాన్స్​ఫార్మర్ల వద్ద కానీ మీటర్లు బిగించడానికి మేము స్వాగతిస్తామని ఆయన అన్నారు. విద్యుత్ మీటర్లు బిగించడం వల్ల రైతు తన హక్కును కోల్పోతాడని అన్నారు. కడపలో ప్రెస్​క్లబ్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే.. ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి ఉచిత విద్యుత్​కు తూట్లు పొడిచి మీటర్లు బిగించే ప్రక్రియను తీసుకు రావడం దారుణమని ఖండించారు. దీనిని అడ్డుకునేందుకు ప్రతి ఒక్క రైతు ముందుకు రావాలని.. లేదంటే విద్యుత్ మీటర్లు రైతులకు ఉరితాడవుతారని అన్నారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల రైతులకు ఇబ్బందులు పడతారని ఆయన తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details