'రిజర్వేషన్లపై సరైన నిర్ణయం తీసుకొండి' - bc sabha in cadapa
కడప ప్రెస్‌క్లబ్‌లో బీసీ జనచైతన్య సభ నిర్వహించారు. ఈ సభకు జిల్లాలోని పలు బీసీ సంఘాల నాయకులు హాజరయ్యారు.
కడప లో బీసీ జన చైతన్య సభ
ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం కడప జిల్లా ఆధ్వర్యంలో... స్థానిక ప్రెస్‌క్లబ్‌లో బీసీ జనచైతన్య సభ నిర్వహించారు. ఈ సభకు జిల్లాలోని పలు బీసీ సంఘాల నాయకులు హజరయ్యారు. బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శంకర్రావు మాట్లాడుతూ... స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు 34 శాతం యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లపై సరైన నిర్ణయం తీసుకోకుంటే జంతర్‌మంతర్ వద్ద భారీ ధర్నా చేపడతామని హెచ్చరించారు.