ఘనంగా బాలకృష్ణ జన్మదిన వేడుకలు - celebrations
నటుడు, హిందూపూరం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకను ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. రోగులకు పండ్ల పంపిణీ, రక్తదానం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
సినీ రంగంలో తండ్రికి తగ్గ తనయుడు నందమూరి బాలకృష్ణ అని ఆయన అభిమానుల సంఘం అధ్యక్షుడు వీరయ్య అన్నారు. నందమూరి బాలకృష్ణ 59వ జన్మదినాన్ని పురస్కరించుకొని అభిమాన సంఘం ఆధ్వర్యంలో కడపలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పద్మ మానసిక వికలాంగుల కేంద్రంలో కేక్ కట్ చేసిన మానసిక వికలాంగులకు తినిపించారు. అనంతరం రెడ్ క్రాస్ సొసైటీలో రక్తదానం చేశారు. ఆల్ షిఫా మానసిక వికలాంగుల కేంద్రంలో అన్నదానం చేశారు. రిమ్స్ ఆస్పత్రిలో పండ్లు పంపిణీ చేశారు.