కడప జిల్లా బద్వేలు పురపాలక లో కూరగాయల మార్కెట్ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. కనీస సౌకర్యాలైన తాగునీరు ,మరుగుదొడ్లు లేవు. వాహనాల పార్కింగ్ సౌకర్యం లేదు. ప్రమాదాల మధ్య రాకపోకలు సాగిస్తున్నారు. బద్వేలుకు పురపాలక హోదా ఏర్పడి దశాబ్దంన్నర ఐనా కూరగాయల మార్కెట్ కు ప్రత్యేకించిన స్థలం లేదు. బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలోనే దీన్ని నడుపుతున్నారు. రోజు రెండు లక్షల కూరగాయల వ్యాపారం జరుగగా, ఏటా పురపాలక కు కూరగాయ వ్యాపారస్తుల నుంచి 20 లక్షల రూపాయలు ఆదాయం లభిస్తోంది. ఆదాయం ఆర్జించడం తప్పితే సౌకర్యాలను కల్పించడంలో పురపాలక అధికారులు విఫలమయ్యారు. ఇక్కడికి నెల్లూరు సరిహద్దు గ్రామాల ప్రజలు కూడా ఇక్కడికి వచ్చే కూరగాయలు కొనుగోలు చేస్తారు . దీంతో ఎప్పుడూ ఈ మార్కెట్ రద్దీగా ఉంటుంది. ఇంతటి ప్రాధాన్యత సంతరించుకున్న ఈ మార్కెట్ను అన్ని విధాలా అభివృద్ధి చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
బద్వేల్ కూరగాయల మార్కెట్ ఇక్కట్లు.. - మార్కెట్ ఇక్కట్లు
కడప జిల్లా బద్వేలు పురపాలక కూరగాయల మార్కెట్ కనీస సౌకర్యాలులేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ అభివృద్ధి చేయాలని వ్యాపారస్తులు కోరుకుంటున్నారు
badvel_vegetabales_market problomes_at_kadapa_district