ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈనాడు - ఈటీవీ భారత్ అధ్యర్యంలో.. స్వచ్ఛభారత్​పై అవగాహన - కడప జిల్లా

పర్యావరణ పరిరక్షణ పరిశుభ్రతతోనే ఆరోగ్యంగా ఉంటామని..ఆరోగ్యవంతమైన గ్రామ స్వరాజ్యం ఏర్పడుతుందని రాయచోటి పురపాలక కమిషనర్ మల్లికార్జున పేర్కొన్నారు. కడప జిల్లా ఓ ప్రైవేటు కళాశాలలో స్వచ్ఛభారత్​పై అవగాహన కార్యక్రమం చేపట్టిన ఈటీవీ భారత్​కు కళాశాల ప్రిన్సిపల్ అభినందనలు తెలిపారు.

ఈనాడు-ఈవీటీ భారత్ అధ్యర్యంలో..స్వచ్ఛభారత్​పై అవగాహన కార్యక్రమం

By

Published : Sep 30, 2019, 9:46 AM IST

Updated : Sep 30, 2019, 2:48 PM IST

ఈనాడు-ఈటీవీ భారత్ అధ్యర్యంలో.. స్వచ్ఛభారత్​పై అవగాహన

కడప జిల్లా రాయచోటి శ్రీసాయి ఇంజనీరింగ్ కళాశాలలో ఈనాడు ఈటీవీ భారత్ ఆద్వర్యంలో స్వచ్ఛభారత్​పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ పరిశుభ్రతతోనే ఆరోగ్యవంతమైన గ్రామ స్వరాజ్యం ఏర్పడుతుందని రాయచోటి పురపాలక కమిషనర్ మల్లికార్జున పేర్కొన్నారు. జాతీయ రహదారి నుంచి కళాశాల వరకు విద్యార్థులు, అధ్యాపకులు మొక్కలు చేతపట్టి పర్యావరణాన్ని పరిరక్షిస్తామంటూ నినాదాలు చేశారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటించేలా అవగాహన కల్పిస్తున్నమని కమిషనర్ పేర్కొన్నారు. యువత స్వచ్ఛతకు ప్రాధాన్యత ఇచ్చి పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించాలని అధ్యాపకులు పిలుపునిచ్చారు. ఈటీవీ భారత్ ప్రజలలో అవగాహన పెంచే కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని కళాశాల ప్రిన్సిపల్ సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. కళాశాలలో 700మంది విద్యార్థులతో మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకుంటామని ఆయన తెలిపారు.

Last Updated : Sep 30, 2019, 2:48 PM IST

ABOUT THE AUTHOR

...view details