పేద ఆర్యవైశ్య కుటుంబాలను ఆదుకునే విధంగా ఆర్య, వైశ్య అఫిషియల్స్ & ప్రొఫెషినల్స్ అసోసియేషన్ ను ఆర్థికంగా పరిపుష్టం చేయాల్సిన అవసరం ఉందని సంస్థ రాష్ట్ర ఉపాధ్యక్షులు చిట్టెం రమేష్ అన్నారు. కడప జిల్లా బద్వేలు వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఆదివారం జరిగిన అవోపా 28వ వార్షికోత్సవ సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆర్యవైశ్య పేద విద్యార్థులకు అవోపా చేయూతనిస్తోందని కొనియాడారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందజేశారు.
''అవోపాను ఆర్థికంగా పరిపుష్టం చేయాలి'' - badvel
కడప జిల్లా బద్వేలులో వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఆర్య, వైశ్య అఫిషియల్స్ & ప్రొఫెషనల్స్ అసోసియేషన్ 28వ వారికోత్సవాలు జరిగాయి.
అవోపా