ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అదుపు తప్పిన ఆటో.. తొమ్మిదిమందికి గాయాలు - కడప జిల్లా, జమ్మలమడుగు

కడప జిల్లా జమ్మలమడుగులో ప్రమాదం జరిగింది. ఉపాధి హామీ మహిళా కూలీలు వెళ్తున్న ఆటో అదుపు తప్పి కాలవలో పడింది. తొమ్మిది మంది గాయపడ్డారు.

kadapa district
అదుపు తప్పిన ఆటో.. తొమ్మిదిమందికి గాయాలు

By

Published : May 1, 2020, 9:56 AM IST

కడప జిల్లా జమ్మలమడుగు మండలంలో ప్రమాదం చోటుచేసుకుంది. ఉదయం మండల పరిధిలోని సరిగేపల్లి వద్ద ఆటో అదుపుతప్పి పక్కనున్న కాలవలో పడిపోయింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది ఉపాధి హామీ మహిళా కూలీలు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు అంబులెన్స్ లో జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఓ మహిళకు తీవ్ర గాయాలు కావటంతో జమ్మలమడుగులోనే ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు . సంఘటన స్థలానికి వెళ్లిన జమ్మలమడుగు పట్టణ ఎస్సై రంగారావు ప్రమాదం వివరాలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details