చౌకదుకాణ డీలర్‌ను ఓవ్యక్తి కత్తితో దాడి చేసి గాయపరిచిన సంఘటన ఆదివారం దిద్దేకుంటలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చౌక దుకాణ డీలర్ శివకేశవరెడ్డి రేషన్ కార్డుదారులకు బియ్యం పంపిణీ చేస్తుండగా.. అదే గ్రామానికి చెందిన విశ్వనాథరెడ్డి ఆకస్మాత్తుగా వచ్చి వెనుక నుంచి కత్తితో దాడి చేశాడు. స్థానికులు అడ్డుకోవడంతో అక్కడి నుంచి పరారయ్యాడు.
చౌక దుకాణ డీలర్‌పై కత్తితో దాడి .. వివాహేతర సంబంధమే కారణమా? - కడప వ్యక్తిపై దాడి
చౌక దుకాణ డీలర్‌ను ఓ వ్యక్తి కత్తితో పొడిచాడు. ఈ ఘటన ఆదివారం కడప జిల్లాలోని దిద్దేకుంటలో జరిగింది.
attack on men in diddekunta kadapa district
శివకేశవరెడ్డికి తీవ్ర గాయమవడంతో పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కడప సర్వజన ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. వివాహేతర సంబంధం విషయంలో గతంలో వీరి మధ్య గొడవలు జరిగినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి:మార్చాల్సింది మంత్రులను కాదు.. ముఖ్యమంత్రినే: తులసి రెడ్డి