ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రభుత్వ ఉద్యోగులకు అందే సౌకర్యాలు అందడం లేదు: ఆర్టీసీ కార్మికులు - కడప జిల్లా తాజా వార్తలు

ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే కార్మికుల చిరకాల స్వప్నం నెరవేరి పదినెలలు గడిచింది. కానీ అక్కడే అసలు సమస్య మొదలైంది. జీతం మినహ ఇతర అలవెన్సులు అందడం లేదని ఏపీ ప్రజా రవాణా సంస్థ ఎంప్లాయిస్ యూనియన్ తెలిపింది. పని భారం పెరిగిందని పేర్కొన్నారు. ప్రభుత్వంలో విలీనం కాకముందే ఉద్యోగులు సంతృప్తిగా పనిచేశారని, ఇప్పుడు అభద్రతా భావం నెలకొందని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు అందే అన్ని సౌకర్యాలు తమకూ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

APSRTC workers
ఏపీఎస్ఆర్టీసీ కార్మికులు

By

Published : Nov 12, 2020, 5:30 PM IST

Updated : Nov 12, 2020, 8:48 PM IST

ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి పది నెలలు గడిచినా ఉద్యోగుల్లో ఇంకా అభద్రతా భావం ఉందని ఏపీ ప్రజా రవాణా సంస్థ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దామోదర్ అన్నారు. కడపలో జరిగిన జిల్లా స్థాయి సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఆర్టీసీ ఉద్యోగుల చిరకాల స్వప్నాన్ని ప్రభుత్వం నెరవేర్చిందని గుర్తుచేశారు. కానీ జీతం మినహ ఇతర అలవెన్సులు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఏపీ ప్రజా రవాణా సంస్థ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దామోదర్

ప్రభుత్వ ఉద్యోగులకు అందే అన్ని సౌకర్యాలు తమకూ కల్పించాలని కోరారు. ఉద్యోగులపై పనిభారం తగ్గించాలని పేర్కొన్నారు. అధికారుల తీరు అసంతృప్తిగా ఉందని, విలీనం కాకముందే బాగుండేదని కార్మికులు భావిస్తున్నట్లు వివరించారు. కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఎల్లప్పుడూ ముందంజలో ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు.

Last Updated : Nov 12, 2020, 8:48 PM IST

ABOUT THE AUTHOR

...view details